మళ్ళీ టీవీ 5 నెం.1, ఎన్టీవీ కంటే సాక్షి, ఈటీవీ 2 కంటే స్టుడియో ఎన్ మిన్న: టామ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వరుసగా రెండో వారం కూడా తెలుగు న్యూస్ చానల్స్ లో టీవీ 5 నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. నవంబర్12-18 తేదీల మధ్య వారానికి టామ్ సేకరించిన దత్తాంశం ప్రకారం టీవీ 9 కంటే టీవీ 5 ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంది. అదే విధంగా సాక్షి టీవీ ప్రజాదరణ ఎన్టీవీని మించిపోగా స్టుడియో ఎన్ చానల్, ఈటీవీ 2 ను మించిపోవటం విశేషం.
10 టీవీ స్థూల రేటింగ్ పాయింట్లు అంతకు ముందువారం కంటే గణనీయంగా పెరిగినప్పటికీ ర్యాంకులో మార్పులేదు. అదే విధంగా వి 6 స్థూల రేటింగ్ పాయింట్లు తగ్గినప్పటికీ ర్యాంకు మారలేదు. జీ 24 గంటలు చానల్ స్థూల రేటింగ్ పాయింట్లు కొద్దిగా పెరిగినప్పటికీ ఒక ర్యాంకు తగ్గింది. గడిచిన మూడు వారాల సగటు గమనిస్తే ఇప్పటికీ టీవీ 9 నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|