తోలి దశ పంచాయితీ ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఎవరికి వారే మేమే గెలిచామని చెప్పుకొన్నారు. కాని ఒక విషయం మాత్రం స్పష్టమయ్యింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ అంత ఘోరంగా ఏమి లేదు..తెలుగుదేశం కూడా పుంజుకున్నట్లు కనిపించింది. ఇక అనుకోన్నట్లుగానే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కూడా బాగానే గెలిచినా సంస్థాగత లోపాలు బయటపడ్డాయి. అది ఈ పార్టీ కి మేలుకొలుపు లాంటిది. కానీ ఈ ఎన్నికలని పార్టీల అసలు బలంగా భావించాల్సిన పనిలేదు. పంచాయితీ ఎన్నికలలో పార్టీ బలం కన్నా అక్కడి స్థానిక పరిస్థితులకే ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది. కాబట్టి ఎవరూ ఎక్కువ ఆనందించాల్సిన విషయం కాని, బాధపడాల్సిన విషయం కాని లేదు.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ తెలంగాణ మీద దృష్టి పెట్టాల్సి వుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలో కి రావాలంటే జగన్ పార్టీకి ఇది చాలా అవసరం. జైలు నుంచే ఈ మాత్రం గెలవగాలిగిన జగన్ బయటకు వస్తే పూర్తిగా చక్రం తిప్పగలడు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని ఒక సామెత వుంది.. కాంగ్రెస్ తో రాజీ పడటం కంటే జైలు జీవితమే ఎంచుకొన్న జగన్ యువతలో మంచి ఇమేజ్ సంపాడించిన మాట వాస్తవం. అది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కి మన్చి ప్లస్ కావొచ్చు.
ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో హాంగ్ తప్పకపోవచ్చు. అప్పడు అందరు రాజులే.